Thursday, December 12, 2019
Follow Us on :

బిగ్‌బాస్‌-3 నిలిపివేయాలంటే హైకోర్టులో పిల్‌

By BhaaratToday | Published On Jul 17th, 2019

 తెలుగు స్టార్‌ మా టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్‌–3 సెన్సార్‌ లేకుండా ప్రసారం అవుతుందని.. పిల్లలు, యువత, మహిళల్ని తప్పుదోవ పట్టించేలా ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, ఈ షోను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌–3 షో నిర్వాహకులపై రాయదుర్గం, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదైన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 21 నుంచి ప్రసారం కాబోయే బిగ్‌బాస్‌–3ని నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. వంద రోజులు ఒకే ఇంట్లో అందరూ ఉంటారని, కెమెరాల చిత్రీకరణలో రికార్డు అయ్యే విషయాలను ప్రసారం చేస్తారని, పలువురిని ఆకట్టుకునేందుకు దురుసుగా, అసభ్యంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.