Monday, September 23, 2019
Follow Us on :

బిగ్‌బాస్‌ హౌస్‌లో కన్నీటి పర్యంతమైన కంటెస్టెంట్…ఎందుకంటే..

By BhaaratToday | Published On Aug 5th, 2019

తెలుగు రియాలిటీ షో `బిగ్‌బాస్` సీజన్ 3 రెండో వారం విజయవంతంగా ముగిసింది. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో మూడో వారం చిన్న చిన్న టాస్కులు, గొడవలతో ముగిసింది. అయితే  తొలివారం హేమ ఎలిమినేట్ కాగా.. ఈ వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. రాహుల్, మహేశ్ విట్టా, జాఫర్, వరుణ్ సందేశ్, వితికా, పునర్నవి, వితికా, శ్రీముఖి, హిమజ ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా.. అందులో జాఫర్‌కే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే జాఫర్ ఎలిమినేషన్ అయి వెళ్తుంటే ఇంటి సభ్యులందరు ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు.  జాఫర్ వెళ్తూ బాబా భాస్కర్ కు ఎవరు కూడా ఏమి అనొద్దు అంటూ వెళ్లిపోయారు.  ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ షోలలో ఎప్పుడు కన్నీరు పెట్టుకోని ఇంటి సభ్యులు జాఫర్ వెళ్తుంటే అందరు ఏడుస్తూ సాగనంపారు. అయితే జాఫర్ ఇంటి నుంచి బయటకు వచ్చి స్టేజీపైకి వచ్చిన తర్వాత `బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులున్నాయా?` అని నాగార్జున ప్రశ్నిస్తే కచ్చితంగా అని జాఫర్ సమాధానం ఇచ్చారు. `మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే వెళతారా?` అని మరోసారి నాగార్జున జాఫర్‌ని ప్రశ్నించారు. దానికి `తప్పకుండా వెళ్తాను` అంటూ జాఫర్ సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో అప్పటికే జాఫర్ ఔట్ అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి.