Monday, November 18, 2019
Follow Us on :

యూట్యూబ్ లో విజయ్ ఫ్యాన్స్ దండయాత్ర

By BhaaratToday | Published On Oct 15th, 2019

విజయ్ హీరోగా, నయనతార హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం బిగిల్..ఈ చిత్రాన్ని తెలుగులో విజిల్ పేరుతో డబ్ చేస్తున్నారు...తాజాగా ఈ చిత్రానికి చెందిన తమిళ ట్రైలర్ ను విడుదల చేశారు.

బిగిల్ .... ఇళయ దళపతి విజయ్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం... ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది... ఇక ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు..ఎ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా చేస్తున్నారు...ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు..ఇక తాజాగా ఈ చిత్రానికి సంభందించిన తమిళ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర బృందం...

 వీరిద్దరి కాంబోలో ఇప్పటికే మెర్షల్ చిత్రం వచ్చింది..ఈ చిత్రంలో విజయ్ కు భారీ హిట్ ను అందించారు అట్లీ... ఇక విజయ్ మెర్షల్ సనిమాలో త్రిపాత్రాభినయం చేశారు...తాజాగా సేమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బిగిల్..అయితే ఆ చిత్రానిక చెందిన తెలుగు ట్రైలర్ ను మాత్రం విడుదల చేయలేదు...తాజాగా విడుదలైన బిగిల్ తమిళ ట్రైలర్ అందరిని ఆకర్షించే విధంగా ఉంది...

ఈ సినిమాలో కుడా విజయ్ డ్యూయల్ రోల్ చేయనున్నారు. ఇక ఈ సినిమా లో స్పోర్ట్స్ టచ్ కూడా ఇచ్చారు డైరెక్టర్ అట్లీ....ఈ సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఇంపార్టెంట్ అని అంటున్నారు...ఇక సినిమాలో ఫైట్స్ ,యాక్షన్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయని చిత్ర బృందం తెలిపింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ కు ఈ సినిమా కుడా మంచి హిట్ ఇస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక విడుదలైన ఈ సినిమా తమిళ ట్రైలర్ యూట్యూబ్ లో కుడా వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది.. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న ట్రైలర్ ప్రస్తుతం 28 మిలియన్లు వ్యూస్ సాధించింది..అంతేకాదు 1.9 మిలియన్ల లైక్ లు సాధించింది .. రికార్డు సృష్టించింది... మొత్తానికి బిగిల్ తమిళ ట్రైలర్ విజయ్ అభిమానుల్లో సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది.