Thursday, July 18, 2019
Follow Us on :

ప్ర‌భుత్వ అధికారిని గుంజీలు తీయించిన ఎమ్మెల్యే.. అంతేకాకుండా..

By BhaaratToday | Published On Jun 6th, 2019

ఒడిశా అసెంబ్లీకి కొత్త‌గా ఎన్నికైన ఓ యువ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారిని ప్రజల ముందు గుంజీలు తీయించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన సరోజ్ కుమార్ మెహెర్.. పాట్నాగఢ్ నియోజకవర్గం నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన వివిధ గ్రామాలను సందర్శించారు. ఈ క్రమంలో నాణ్యత లేని రోడ్లను గుర్తించిన ఎమ్మెల్యే.. సంబంధిత జూనియర్ ఇంజినీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోడ్ల నాణ్యతను పరిశీలించడంలో విఫలమైనందుకు ప్రజల ముందే ఆ ప్రభుత్వ ఉద్యోగిని 100 గుంజీలు తీయించడంతోపాటు.. గ్రామస్థులకు క్షమాపణ చెప్పించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.