Sunday, August 25, 2019
Follow Us on :

ఎన్నికలు వస్తేనే ఆమెకు అంబేద్కర్‌ గుర్తుకువస్తారు!

By BhaaratToday | Published On Apr 13th, 2019

బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో శనివారం జరిగిన బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌ పేరును రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. మాయావతికి ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్‌ను గుర్తు చేసుకుంటారని.. ఆమె అధికారంలోకి వచ్చినపుడు మాత్రం ఆయనను పూర్తిగా మర్చిపోయి, తన సొంత విగ్రహాలనే నిర్మించుకుంటారని అమిత్ షా ఆరోపించారు. అంబేద్కర్‌ను సముచితంగా గౌరవిస్తున్నది బీజేపీయేనని అమిత్ షా చెప్పారు. గత ఐదేళ్ళలో తాము అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించామని తెలిపారు.