Thursday, August 22, 2019
Follow Us on :

భయంకరమైన అవినీతితోనే ఏపీలో టీడీపీ భూస్థాపితం

By BhaaratToday | Published On Jul 14th, 2019

టీడీపీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేవలం తానా సభలలో మాత్రమే మిగులుతుందని, భయంకరమైన అవినీతితో ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరాలకు నిలయంగా టీడీపీ మారిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... పెనం నుంచి పొయ్యిలో పడేందుకు కూడా టీడీపీకి అవకాశం కూడా ఇవ్వరాదని హెచ్చరించారు.
 
2024 నాటికి ఏపీలో అధికార పార్టీ దిశగా బీజేపీ ఎదగాలని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఏపీలోని అత్యధిక ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించేట్లు చూడాలని, దేశం మొత్తం మీద వచ్చిన ఆదరణను ప్రేరణగా తీసుకొని ఏపీలో బలపడాలని రాష్ట్ర నాయకత్వానికి ఆయన సూచించారు. పార్టీ అధిష్ఠానం ఆశించినంత మేర ఏపీలో ఓట్లు రాలేదని, అందుకే బలపడేందుకు ప్రతీ కార్యకర్తా ఛాలెంజింగ్‌గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీలో అధికార టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న నమ్మకం ప్రజల్లో బలపడిందని, ఏపీలో కూడా అలా బలపడేందుకు కృషి చేయాలని కోరారు.