Saturday, December 14, 2019
Follow Us on :

వైసీపీ విచారణ జరిపితే వారిద్దరు జైలుకెళ్లడం ఖాయం

By BhaaratToday | Published On Aug 4th, 2019

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం అవినీతిపై వైసీపీ ప్రభుత్వం  విచారణ జరిపితే చంద్రబాబు, లోకేష్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. టీడీపీలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ మాత్రమే మిగులుతారని.. ఇంకెవ్వరూ ఉండరని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు బీజేపీలో చేరడానికి ప్రాథమిక చర్చలు జరుపుతున్నారని తెలిపారు. పోలవరం అవినీతిపై మాట్లాడే హక్కు టీడీపీ కోల్పోయిందన్నారు. ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని చంద్రబాబు, లోకేష్ నేరుగా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పాత ధరలకే పోలవరం రీ- టెండర్లు వేయాలని.. లేకపోతే పోలవరం అంధకారంలో పడిపోయే అవకాశం ఉందన్నారు.