Thursday, December 12, 2019
Follow Us on :

చిరంజీవి మాతో సంప్రదింపులు జరపలేదు.. ఒక‌వేళ జాతీయ నేత‌ల‌తో..

By BhaaratToday | Published On Jul 19th, 2019

మెగాస్టార్‌ చిరంజీవి బీజేపీలో చేరే విషయమై తమతో సంప్రదింపులు జరపలేదని, ఒక‌వేళ ఆయ‌న‌ జాతీయ స్థాయి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారేమో తెలియదని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 11తరువాత పార్టీలో కీలక మార్పులు, చేర్పులు ఉంటాయని వెల్లడించారు.

Image result for chiranjeevi 

టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్సీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. అయితే.. వారు తమ పదవులకి రాజీనామా చేసి బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని మాధవ్ తెలిపారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆయ‌న‌ తెలిపారు. రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి వస్తుందని, సామాజిక న్యాయం ఆధారంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అనేది ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతుందని, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడై రెండేళ్లు మాత్రమే అయ్యిందని మాధ‌వ్ అన్నారు.