Monday, September 23, 2019
Follow Us on :

జగన్‌ను అందుకే క‌లిశాను

By BhaaratToday | Published On Jun 11th, 2019

ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌ను బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు నేడు కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలియ‌జేశాన‌ని తెలిపారు. అనంతరం జీవీఎల్‌ మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశానని.. రాష్ట్రాభివృద్ధి, సమస్యలపైన మాట్లాడానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం సహకారంపై చర్చించామన్న ఆయన.. రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీ ఎంపీకి ఇచ్చే విషయమై తనకు ఎటువంటి సమాచారం లేదని జీవీఎల్‌ తెలిపారు.