Monday, August 19, 2019
Follow Us on :

రెండు పార్టీలు త్వ‌ర‌లో మూతప‌డ‌నున్నాయి...మాజీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By BhaaratToday | Published On Jul 17th, 2019

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెండు పార్టీలు కచ్చితంగా త్వరలోనే మూతపడనున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి ఎవరెవరు వస్తున్నారో ఇప్పుడే చెబితే ఎలా.. సస్పెన్స్ ఉండదన్నారు. రాజకీయ పార్టీలకు మిత్రపక్షం-శత్రుపక్షం అంటూ ఉండవని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని పేర్కొన్నారు. అసెంబ్లీలో సభ్యుల వ్యవహార శైలిలో అప్పుడు.. ఇప్పుడు మార్పు కనిపించడం లేద‌ని, అప్పుడు వ్యక్తిగత దూషణలతో సభ నడిస్తే.. ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే నడుస్తుందని అన్నారు. సభ్యులు అసెంబ్లీలో పరుషమైన భాషను వాడటం మంచిది కాదని హితవు పలికారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నట్టు భావన కనబడుతోందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. అందులో ప్రయోజనాలన్నీ వస్తున్నాయని వెల్లడించారు.