Tuesday, September 24, 2019
Follow Us on :

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..!

By BhaaratToday | Published On Mar 21st, 2019

బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదలైంది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నేత జేపీ నడ్డా ఆ జాబితా విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్థుల వివరాలను ఆయన ప్రకటించారు.ఏపీ నుంచి రెండు స్థానాలకు మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించారు. విశాఖపట్టణం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నరసరావుపేట నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. 

సికింద్రాబాద్ సీటును గురువుకు కాకుండా శిష్యుడికి ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. సిట్టింగ్ అభ్యర్థి అయిన బండారు దత్తాత్రేయను కాదని, ఆయన శిష్యుడు, అంబర్‌పేట్ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని బరిలోకి దించింది. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిస్తే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిపదవి వరించే అవకాశం ఉంది. ఇక బండి సంజయ్ కు ఎంపీ టికెట్ రావడంతో ఆయన వర్గంలో ఆనందం వెల్లివిరుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్ ను ఎలాగైనా గెలిపించుకుంటామని ఆయన అభిమానులు చెబుతున్నారు.    


తెలంగాణ:

కరీంనగర్- బండి సంజయ్,
నిజామాబాద్-డి. అరవింద్
మల్కాజ్ గిరి- ఎన్. రామచంద్రరావు
సికింద్రాబాద్- జి.కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్-డీకే అరుణ  
నాగర్ కర్నూల్- బంగారు శృతి
నల్గొండ- జితేంద్ర కుమార్
భువనగిరి- పీవీ  సుందర్ రావు
వరంగల్- చింతా సాంబమూర్తి
మహబూబాబాద్- హుస్సేన్ నాయక్