Thursday, December 12, 2019
Follow Us on :

బీజేపీలోకి 20మంది ఎమ్మెల్యేలు.. టీడీపీలో మిగిలేది ఆ ముగ్గురే..

By BhaaratToday | Published On Jul 17th, 2019

త్వరలో రాయలసీమ ప్రాంతంలో 20మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. టీడీపీపై విష్ణువర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీది ముగిసిన అధ్యాయం అని అన్నారు. టీడీపీని ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని.. బీజేపీలో మాత్రం టీడీపీని విలీనం చేసుకునే ప్రసక్తే లేదని ఆయ‌న అన్నారు.

Image result for chandrababu balakrishna lokesh 

ఇటీవలే కొంతమంది టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని, ఇంకా కొంతమంది తమతో టచ్ లో ఉన్నారని విష్ణు చెప్పారు. చివరికి టీడీపీలో మిగిలేది చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, బావమరిది బాలక్రిష్ణ మాత్రమే అని విష్ణు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేర్చుకునేది లేదని ఆయ‌న అన్నారు. ఏపీలో పార్లమెంటు నియోజకవర్గానికి లక్ష మంది చొప్పున 25 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడమే తమ లక్ష్యం ఆయ‌న‌ అన్నారు.