Monday, November 18, 2019
Follow Us on :

అమిత్‌షాకు కార్య‌క‌ర్త తేనేటి విందు

By BhaaratToday | Published On Jul 6th, 2019

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర హోంశాఖ‌ మంత్రి అమిత్‌షా.. సోనీ నాయక్‌ అనే బీజేపీ కార్యకర్త ఇంటికి వచ్చారు. ఆయనే స్వయంగా ఆమెకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. అంతేకాదు సోనీ నాయక్‌ ఇచ్చిన ఆతిథ్యాన్ని అమిత్‌షా స్వీకరించారు. ముందుగానే అనుకున్నట్లు సోనీ నాయక్‌, ఆయనకు తినుబండాలు పెట్టారు. ఆమె ఇచ్చిన తినుబండాలను అమిత్‌షా ఆప్యాయంగా తిన్నారు. అంతేకాదు సోనీ నాయక్‌ ఇంట్లో తేనేటి విందు స్వీకరించారు. 

అనంతరం ఆమె తన కుటుంబసభ్యులను అమిత్‌షాకు పరిచయం చేశారు. సోనీ తన ఇంట్లో ఉన్న ఫొటోలను అమిత్‌షాకు చూపెడుతూ వాటికి సంబంధించిన వివరాలు చెప్పారు. ముందుగా చెప్పినట్లుగానే సోనీ, అమిత్‌షాకు ఓ విజ్ఞాపన పత్రం అందజేశారు. అమిత్‌షాతో కుటుంబసమేతంగా సోనీ ఫొటో కూడా దిగారు.
 
సోనీ నాయక్‌ స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం తిరుమలగిరి. 35 ఏళ్ల క్రితం భర్త కిషన్‌తో వచ్చి బాలాపూర్‌ మండలం మామిడిపల్లి సమీపంలోని రంగనాయక తండాలో స్థిరపడింది. భార్యాభర్తలు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఆమె చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అమిత్‌ షా శనివారం ఆమె ఇంటికి వచ్చి బీజేపీ సభ్యత్వం ఇచ్చారు.