Saturday, October 19, 2019
Follow Us on :

మాట మీద నిలబడ్డారు.. దటీజ్ రాజాసింగ్..!

By BhaaratToday | Published On Jan 18th, 2019

చెప్పిన మాట మీద కట్టుబడ్డారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. కొద్ది రోజుల క్రితం ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేతను నియమించడాన్ని రాజా సింగ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఎంఐఎం నేతకు ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించడాన్ని వెనక్కి తీసుకోవాలని అప్పట్లోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఎంఐఎం నేత ప్రొటెం స్పీకర్‌గా ఉన్నంత కాలం తాను అసెంబ్లీకి రానని స్పష్టం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని.. భారత్ మాతా కీ జై, జై భారత్ అని నానాదాలు చేయని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు అప్పగించడం ఏంటని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రొటెం స్పీకర్ చేత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని, స్పీకర్ ఎన్నిక తర్వాతే తాను అసెంబ్లీలో కాలుపెడతానని చెప్పారు. అనుకున్నట్లుగానే ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి రాలేదు. 

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా... 114 మంది ప్రమాణం చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, రాజా సింగ్, సండ్ర వెంకటవీరయ్యలు సభకు హాజరుకాలేదు.