Saturday, December 14, 2019
Follow Us on :

అంబులెన్సుల్లో న్యూజిలాండ్ క్రికెటర్లు..!

By BhaaratToday | Published On Aug 30th, 2019

ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు శ్రీలంక టూర్ లో ఉంది. టెస్ట్ సిరీస్ ముగిసిన తరువాత టీ20 లకు రెడీ అవుతున్న సమయంలో వారికి అనుకోని ఇబ్బంది ఎదురైంది. శ్రీలంక లోని ప్రముఖ పర్యాటక స్థలం క్యాండీకి వెళ్లారు. ఆ ప్రాంత అందాలు వీక్షించిన అనంతరం తిరిగి హోటల్ కు పయనమయ్యే క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు మొరాయించింది. సాధారణంగా క్రికెటర్స్ అంటే చాలు పెద్ద పెద్ద లగ్జరీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం క్లచ్ విరిగిపోవడంతో బస్సు నిలిచిపోయింది. దీంతో వారిని ఎలాగైనా హోటల్ కు తరలించాలని భావించిన అధికారులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అన్నిరకాల వాహనాలను క్రికెటర్లను హోటల్ కు తరలించడానికి ఉపయోగించారు. అంబులెన్స్ లు కూడా వాడారు.. ఆ వీడియోలను వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఆర్మీ వాహనాలు, ఇతర వాహనాలలో కూడా వారు హోటల్ కు చేరుకున్నారు.