Tuesday, May 21, 2019
Follow Us on :

సౌత్ హీరోల‌పై బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పొగ‌డ్త‌లు

By BhaaratToday | Published On Mar 16th, 2019

సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, దళపతి విజయ్‌లకు సౌత్ ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్ల సినిమా మొదలైందంటేనే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలుంటాయి. ఈ ముగ్గురి సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా టాప్‌లోనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు.
 
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఓ చాన‌ల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్క నటుడికి ఫ్యాన్ క్లబ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రజినీ, చిరంజీవి, బన్నీ ముగ్గురు, విజయ్ స్టార్స్ సౌత్ ఇండియన్ సినిమాలను బాగా ప్రభావితం చేస్తారు. అంతేకాకుండా వారి యావరేజ్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. వారి ఫ్యాన్ క్లబ్ చాలా స్ట్రాంగ్’ అని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తాడు.