Saturday, October 19, 2019
Follow Us on :

అలాంటిదేమి లేదు: బోయ‌పాటి

By BhaaratToday | Published On Feb 18th, 2019

యాక్షన్ ను .. ఎమోషన్ ను మిక్స్ చేసి మాస్ ఆడియన్స్ ను అలరించడంలో బోయపాటి సిద్ధహస్తుడు. దర్శకుడిగా ఆయన ఖాతాలో భారీ విజయాలు ఉన్నాయి. అలాంటి బోయపాటి 'వినయ విధేయ రామ' సినిమాలో యాక్షన్ పాళ్లు ఎక్కువగా కలిపేయడం వలన దెబ్బతినేసింది. దాంతో అంతకుముందు బోయపాటితో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిన నిర్మాతలు వెనక్కి తగ్గారట. అడ్వాన్సులు ఇచ్చిన వాళ్లు తమ ఆలోచనను విరమించుకున్నట్టుగా ఆయనతో చెబుతున్నారని వినికిడి. ఇదే విషయాన్ని బోయపాటి దగ్గర ఎవరు ప్రస్తావించినా, అలాంటిదేమీ లేదంటూ సింపుల్ గా సమాధానమిస్తున్నట్టుగా సమాచారం. తనపై వస్తోన్న ఇలాంటి విమర్శలన్నీ కూడా, బాలకృష్ణతో హిట్ పడిన తరువాత సర్దుకుంటాయని అంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ప్రాజెక్టు పనిలో ఉన్న ఆయన, మరోసారి తన సత్తా చాటుకుంటాడేమో చూడాలి.