Wednesday, October 16, 2019
Follow Us on :

కూతురిలా వేషం వేసుకొని దొరికిపోయాడు.. చివరికి ఏ నిర్ణయం తీసుకున్నాడంటే

By BhaaratToday | Published On Aug 8th, 2019

బ్రెజిల్‌ డ్రగ్‌ డాన్‌ క్లావినో డా సిల్వా.. కొద్ది రోజుల క్రితం అతడికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. జైలు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ప్లాన్ వేసిన ఆ ఖైదీ.. తమ కుటుంబ సభ్యులను జైలులో తనను చూడడానికి రమ్మన్నాడు. కూతురితో పాటు కుటుంబ సభ్యులు జైలుకు వచ్చారు. తన కూతురి ముఖంలా ఉన్న ఓ సిలికాన్ మాస్క్, టీ షర్ట్, ప్యాంట్ తెప్పించుకున్నాడు. విజిటింగ్ అవర్స్ ముగిసిన తర్వాత ముఖానికి ఆ మాస్క్ ధరించాడు. పింక్ టీ షర్ట్, ప్యాంట్‌తో పాటు అమ్మాయిలా కనపడేందుకు అన్ని ప్లాన్స్ వేశాడు.. దాదాపుగా బయటకు వెళ్లిపోయే సమయంలో జైలు అధికారులకు డౌట్ వచ్చింది. అతన్ని ఆపి చూడగా.. అసలు స్వరూపం బయటపడింది. అంతే ఆ మొత్తం వీడియో తీసి పోలీసులు సోషల్ మీడియాలో పెట్టారు. అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. 

Brazil Foiled Jail Escape


అయితే క్లావినో డా సిల్వా మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. జైలులోని తనగదిలో బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని చనిపోయాడని జైలు అధికారులు వెల్లడించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన అతన్ని హై సెక్యూరిటీ యూనిట్‌కు తరలించగా అతడు ఇక తప్పించుకోలేనేమోనని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లావినో డా సిల్వా 2013లో జైలు నుంచి టన్నెల్‌ తవ్వి 27 మంది ఖైదీలతో పారిపోయాడు.. ఆ తర్వాత ఎలాగోలా పట్టేసుకున్నారు. ఎన్నోసార్లు అతడి పారిపోవాలని ప్రయత్నించాడు కానీ వీలుపడలేదు. 73 సంవత్సరాల శిక్ష విధించడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Brazil Foiled Jail Escape