Wednesday, October 16, 2019
Follow Us on :

బ‌డ్జెట్‌ 2019-20....మోడీ స‌ర్కార్ రైతుల‌పై వ‌రాల జ‌ల్లు

By BhaaratToday | Published On Feb 1st, 2019

పార్లమెంట్ లో 2019-20 మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర మంత్రి షీయుష్ గోయ‌ల్ ప్ర‌వేశ‌పెట్టారు. చిన్న కారు రైతుల ప్రయోజనం కోసం 2019-20 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. 12 కోట్ల మంది రైతులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని పీయూష్ గోయల్ తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము చేరే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ పథకం 2018 డిసెంబరు నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతు కుటుంబాలు ఈ పథకం వల్ల సంతోషంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయ ఆదాయ మద్దతు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రూ.6వేలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు. రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఈ సొమ్మును జమ చేయనున్నట్లు ప్రకటించారు.

 

 

► రైతు సాయం కోసం 75 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపు

► చిన్నసన్నకారు రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. 

► నేరుగా ఖాతాలోకే కేంద్రం నగదు సాయం. మూడు విడతల్లో నగదు అందజేత. తొలి విడతగా తక్షణమే రూ.2వేల సాయం.

► ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల సాయం అందజేస్తాం. 

►  ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపు

► ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపు

► రైతు సాయం కోసం 75 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపు

► రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లింపు

 

 

బ‌డ్జెట్‌లో ముఖ్యాంశాలు :

► 50 కోట్ల మందికి వైద్య సదుపాయాలు

► గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యం రంగం భారీ మార్పులు చూసింది.

► ప్రధాని మోదీకి ప్రజల ఆరోగ్యంపై ఎంతో ఆందోళన ఉండేది.

► 50 కోట్ల మందికి వైద్య సదుపాయాలు అందించేందుకు ఆయుష్మాన్‌ పథకం ప్రవేశపెట్టాం.

► ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం

► దేశ ఆత్మవిశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం పెంచింది.

► 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నాం

► దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడింది.

► జీడీపీ వృద్ధి రేటులో గణనీయ పురోగతి సాధించాం

► విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం

► గడిచిన ఐదేళ్లలో భారత్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.

► డబుల్‌ డిజిట్‌ ద్రవ్యోల్పణాన్ని తగ్గించాం.

► ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం భారత్‌

► నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాం

► రాష్ట్రాలికచ్చే ఆర్థిక వాటాను పెంచాం.

► సహకార సమాక్యస్పూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాం

► బ్యాంకింగ్‌ రంగంలో 4ఆర్‌ ప్రవేశపెట్టాం

► మొండిబకాయిలు మూడు లక్షల కోట్లు వసూలు చేశాం

► మా చర్యల కారణంగా నిన్నే 3 బ్యాంకులపై ఆంక్షలు తొలిగాయి.

► బ్యాంకుల సరైన స్థితి ప్రజల ముందుంచాలని ఆర్‌బీఐని కోరాం

► బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం.

► ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడటమే మా ధ్యేయం

► మేం అవినీతి రహిత పాలనను అందించాం.

► స్వచ్ఛభారత్‌ ద్వారా ప్రవర్తనలో మార్పు తెచ్చాం.

► బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాం.

► రెరా ద్వారా నియంత్రణను విధించాం.

► రిజర్వేషన్లను యథాతధంగా ఉంచుతూ కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చాం.