Sunday, August 18, 2019
Follow Us on :

ఇక్కడ ఎన్నికలు అంటేనే అధికారులకు పెద్ద సవాల్

By BhaaratToday | Published On Apr 11th, 2019

ఎటు చూసినా కొండలే. ఈ కొండల మధ్యలో పారే సెలయేళ్లు. సెలయేళ్లకు దగ్గరలో అక్కడక్కడా విసిరేసినట్లేం ఊళ్లు. సర్కారు రికార్డుల్లో ఊరుగా నమోదైనా.. జనాభా చాలా తక్కువగా ఉంటుంది. ఆ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించాలంటే ఎన్నికల సిబ్బంది ఎన్నో ప్రయాసలు పడాల్సిందే.

పశ్చిన బెంగాల్ లోని బుక్సా ఫోర్ట్ ప్రాంతం.. ఇక్కడ ఎన్నికల నిర్వహణ ఓ పెద్ద సవాల్.. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే సరైన రవాణా వ్యవస్థ లేదు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. మరోవైపు.. ఈ పోలింగ్ స్టేషన్ కు చేరుకోవడానికి సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. కొండల మధ్యన నడుస్తూ ప్రయాణమయ్యారు. ఈ ప్రాంతానికి కార్లు, వ్యాన్లు వెళ్లే పరిస్థితి లేదు. అవే కాదు స్కూటర్లు, బైక్‌‌‌‌లకు కూడా నో ఛాన్స్. దీంతో నడకనే నమ్ముకున్నారు పోలింగ్ సిబ్బంది. పోలింగ్ మెటీరియల్‌‌‌‌ని భుజాన మోసుకుని ఐదు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ప్రతి పోలింగ్ టీంకి సాయంగా కొంతమంది పోర్టర్లను సర్కారు ఇచ్చింది. ఈవీఎంలు, వాటికి అనుసంధానంగా ఉండే వీవీప్యాట్‌ లు ఇతర పోలింగ్ మెటీరియల్‌‌‌‌ని జాగ్రత్తగా సంచుల్లో ప్యాక్ చేసుకుని పోర్టర్లు మోస్తుంటారు. ఇదిలా ఉండగా.. బుక్సా పోర్ట్  ప్రాంతంలో తొలి దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి.