Wednesday, October 16, 2019
Follow Us on :

గుడ్ న్యూస్.. కేబుల్,డీటీహెచ్ ధరలు తగ్గే అవకాశం

By BhaaratToday | Published On Aug 20th, 2019

చూసే ఛానల్స్ కు మాత్రమే డబ్బులు కట్టండి అంటూ కొద్ది రోజుల క్రితం ట్రాయ్ విధించిన కొత్త నిబంధనల కారణంగా కేబుల్, డీటీహెచ్ ధరలు తగ్గుతాయని భావించారు. అయితే ఆ ధరలు చాలా ఎక్కువ అయిపోయాయి. హిందీ సినిమాలు చూడాలంటే ఎక్కువ డబ్బులు కట్టాలి, స్పోర్ట్స్ ఛానల్స్ చూడాలంటే ఇంకొంచెం డబ్బులు వదిలించుకోవాల్సి ఉంది.. దీనిపై ఇప్పటికే అందరూ పెదవి విరుస్తున్నారు.   నూతన విధానం వినియోగదారులకు భారంగా మారడంతో ట్రాయ్ ఇప్పుడు దీనిపై సమీక్ష నిర్వహించబోతోంది.  

 దేశంలోని కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ఊరట కలిగించేలా ట్రాయ్ రంగంలోకి దిగింది. టెలికాం కంపెనీలు చానెల్ ధరలు, బొకే చార్జీలను మరోసారి సమీక్షించాలంటూ ట్రాయ్ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 16 లోగా ధరల తగ్గింపుపై అభిప్రాయాలు, ప్రతిపాదనలు వెల్లడించాలని స్పష్టం చేసింది.