Wednesday, October 16, 2019
Follow Us on :

ప్ర‌ధాని స‌భ‌లో కుప్ప‌కూలిన కెమెరామెన్‌..!

By BhaaratToday | Published On Jan 30th, 2019

గుజరాత్‌లోని సూరత్‌లో న్యూ టర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో అక్కడున్న ఓ కెమెరామెన్‌ కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన మోదీ తక్షణమే తన ప్రసంగాన్ని ఆపేసి.. అధికారులను, పోలీసులను అప్రమత్తం చేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాలని మోదీ సూచించారు. దీంతో కెమెరామెన్‌ కిషన్‌ రామోలియాను 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  స్పృహ వచ్చిన తర్వాత రామోలియా మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం నుంచి తాను నీళ్లు తాగలేదు. వాటర్‌ బాటిళ్లను సభలోకి అనుమతించలేదు. దీంతో స్పృహ కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రధాని మోదీ తనను గమనించి అధికారులను అప్రమత్తం చేసి ఆస్పత్రికి తరలించేలా సహాయం చేశారని రామోలియా పేర్కొన్నారు.