Monday, November 18, 2019
Follow Us on :

చంద్రబాబు నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

By BhaaratToday | Published On Oct 19th, 2019

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. చంద్రబాబుతో పాటూ టీడీపీ నేత వర్ల రామయ్య పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారని గుంటూరు అరండల్‌పేట పోలీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వీరిద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. 

చంద్రబాబు నాయుడు, వర్ల రామయ్య చేస్తున్న వ్యాఖ్యల వలన పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బ తింటోందని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ నాయకులు విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వారు మాట్లాడుతున్నరని, డీజీపీ గౌతం సవాంగ్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు చెప్పుకొచ్చారు.