Thursday, April 25, 2019
Follow Us on :

అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీల మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయంటే..?

By BhaaratToday | Published On Mar 21st, 2019

ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేశారు. అయితే తన అన్నయ్య ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తూ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ తన నామినేషన్ పత్రాలు సమర్పించిన మర్నాడే అక్బరుద్దీన్ కూడా నామినేషన్ వేశారు. అన్నదమ్ములు ఇద్దరూ ఎందుకు నామినేషన్ వేశారంటే ఒకవేళ ఎవరి మీదైనా ఎలక్షన్ కమీషన్ ఆంక్షలు విధిస్తే తమ పార్టీకి చెందిన అభ్యర్థి లేకుండా పోతారనే కారణంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే గా అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. అసదుద్దీన్ పత్రాల్ని ఈసీ ఆమోదించిన తర్వాత అక్బరుద్దీన్ తన నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటారు.  


నామినేషన్ సందర్భంగా అన్నదమ్ములు తమ మీద ఉన్న కేసులను, తమ ఆస్థులను గురించి కూడా ప్రస్తావించారు. 2014 ఎన్నికల సమయంలో రూ. 3.94 కోట్లుగా ఉన్న ఆయన కుటుంబ ఆస్తి ప్రస్తుతం రూ.17.84 కోట్లకు చేరినట్లు అసదుద్దీన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన చేతిలో రూ. 2 లక్షలు ఉన్నాయని తెలిపారు. రూ. 2 లక్షల విలువైన తుపాకులు ఉన్నాయని పేర్కొన్నారు. ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. తన వద్ద సొంత వాహనం ఒకటి కూడా ఉన్నట్టు ఒవైసీ చూపించలేదు.  రూ. లక్ష విలువైన ఎన్‌పీ బోర్ 0.22, ఎన్‌పీ బోర్ 30-60 రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని సిర్పూర్, హైదరాబాద్‌లోని మీర్‌చౌక్, చార్మినార్, బిహార్, నాందేడ్ పోలీస్ స్టేషన్‌లలో తనపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు. తన పేరిట శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇళ్లు ఉన్నాయని, అలాగే తన భార్య ఫర్హీన్ పేరిట సన్సద్ విహార్, ద్వారకా, న్యూఢిల్లీ, మిస్రీగంజ్‌లో ఇళ్లు ఉన్నట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. తను రూ.9.30 కోట్లు, తన భార్య ఫర్హీన్ రూ.2.75 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్నట్లుగా వెల్లడించారు. 

అక్బరుద్దీన్, ఆయన భార్య ఫర్జానా ఆస్తులు, అప్పుల వివరాలు 
చరాస్తులు -
అక్బరుద్దీన్ - 7,90,23,291
ఫర్జానా (భార్య) - 3,48,40,550

స్థిరాస్తులు -
అక్బరుద్దీన్ - 3,38,00,000
ఫర్జానా (భార్య) - 3,71,65,000

అప్పులు -
అక్బరుద్దీన్ - 5,91,36,766
ఫర్జానా (భార్య) - 5,39,38,175


ఇక అక్బరుద్దీన్ మీద ఉన్న పెండింగ్ కేసుల చిట్టా చూసి ప్రజలు నోళ్లు వెళ్లబెడుతున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ నామినేషన్ పత్రాల ప్రకారం ఆయనపై 14 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్రలో అక్బరుద్దీన్ పై కేసులు నమోదయ్యాయి. 

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, మతపరమైన విధ్వేషాలు రెచ్చగొట్టారంటూ... 2017లో ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది.
ఎన్నికలకు సంబంధించిన ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసు పెండింగ్‌లో ఉన్నాయి.
 2015లో రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టారని బీహార్‌లోని కచ్చాడమన్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది.
మహబూబ్ నగర్‌లో మోహన్ గౌడ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చారు. మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్‌లో ఆరోపించారు. ఈ కేసు నాంపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉంది.
రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసుంది. మత పరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ... నాంపల్లిలో కరుణా సాగర్ అనే వ్యక్తి ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ దగ్గర చట్ట విరుద్ధంగా మారణాయుధంతో హల్ చల్ చేశారంటూ కర్ణాటకలోని హమ్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో 2013లో ఓ కేసు నమోదైంది.
2013లో నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. రెండు వర్గాల మధ్య చిచ్చు రేపేలా కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి.
2013లో ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో మత పరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంవీ బాలి రెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చారు.
2013లో ఎల్బీనగర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బి.ఈశ్వర్ యాదవ్ ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చారు.
2013లో జార్ఖండ్‌లోని బొకారోలో రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఓ కేసు నమోదైంది.
2013లో మహారాష్ట్రలోని కుర్లా-ముంబైలో మరో ప్రైవేట్ కంప్లైంట్ నమోదైంది.