Monday, August 19, 2019
Follow Us on :

పాక్ ట్వీట్‌పై దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన కేంద్ర‌మంత్రి

By BhaaratToday | Published On Jul 18th, 2019

కుల్‌భూష‌ణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఇచ్చిన తీర్పుపై పాక్ త‌న‌ వక్రపూరిత వైఖ‌రిని ప్రదర్శించింది. జాదవ్ కేసులో పాక్ విజయం సాధించిందంటూ తన అధికార ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. కుల్ భూషణ్ జాదవ్‌ను జైలు నుంచి విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని భావించిన భారత్ ప్రయత్నాలను ఐసీజే తిరస్కరించిందంటూ ప్రచారం చేసింది. అయితే.. ఈ ట్వీట్ స్పందించిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఇది మీ తప్పు కాదు.. తీర్పును అంతర్జాతీయ న్యాయస్థానం ఇంగ్లీష్‌లో చెప్పడం వల్ల కేసులో మీరు గెలిచినట్లు భావిస్తున్నారని’ గిరిరాజ్ సింగ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
 
కాగా.. గూఢచర్యంలో ఆరోపణల కేసులో పాక్ ఆర్మీ కోర్టు భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో విచారణ జరిపిన ఐసీజే.. కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షపై స్టే ఇచ్చింది. అంతేకాకుండా వియన్నా ఒప్పందం ప్రకారం కుల్ భూషణ్ జాదవ్ హక్కులను పాక్ ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.