Saturday, August 24, 2019
Follow Us on :

చెట్లు మాత్ర‌మే ప‌డిపోతే మీడియాను ఎందుకు అనుమ‌తించ‌రు..?

By BhaaratToday | Published On Mar 13th, 2019

భార‌త‌సైన్యం చేతిలో పాక్ చావు దెబ్బ తిన్నా మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తుంది. భారత వైమానిక దళం దాడుల కారణంగా 19చెట్లు ధ్వంసమయ్యాయని పాక్‌ అటవీ విభాగం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ విష‌య‌మై స్పందించిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దాడులు నిర్వహించడం వల్ల చెట్లు మాత్రమే ధ్వంసమైతే పాకిస్థాన్ ఎందుకు మీడియాను అనుమతించడం లేదని  ప్రశ్నించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మంగళవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పాత్రికేయులను పాక్‌ అడ్డుకుందని "రాయిటర్స్‌ అనే వార్తా సంస్థ‌ మార్చి 8న వెల్లడించిందని... వాతావరణం, ఇతర కారణాలతో పాకిస్థానీ భద్రతా సిబ్బంది తమను ఘటనా ప్రదేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారని మరో మీడియా తెలిపిందని... దానికి సంబంధించి ఐరాసలో కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయని అన్నారు. బాలాకోట్ టేప్స్‌ దర్యాప్తులో వెల్లడైన విషయాల గురించి మంత్రిని ప్రశ్నించగా.. నిఘాకు సంబంధించిన అంశాలపై తాను మాట్లాడలేనన్నారు. అయితే బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరం చాలా కాలం నుంచి ఉందని, ఫిబ్రవరి 24న కూడా అక్కడ శిక్షణా కార్యక్రమం జరిగిందని ఆమె వెల్లడించారు.