Wednesday, October 16, 2019
Follow Us on :

ఏపీకి ప్యాకేజీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

By BhaaratToday | Published On Feb 12th, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లే ప్యాకేజీకి మార్పులు చేశామని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా 2016 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారన్నారు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగానే ప్యాకేజీకి పలు మార్పులు చేశామన్నారు. దానికి కేంద్ర కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపిందని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలుపుతూ... 2017 మే 2న ఆర్థికమంత్రికి లేఖ రాశారని పీయూష్‌ గోయల్‌ చెప్పారు.