Wednesday, October 16, 2019
Follow Us on :

ఆస్తులు ఉన్న నేతలను బెదిరిస్తున్నారు: చ‌ంద్ర‌బాబు

By BhaaratToday | Published On Feb 19th, 2019

వైసీపీలో చేరాలని హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న నేతలను బెదిరిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిప‌డ్డారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బాబు మాట్లాడుతూ పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య పెడుతున్నారని... అలా పోయే వారిని పట్టించుకోవద్దని నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే అని తేల్చిచెప్పారు. పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈరోజు, రేపు, ఎల్లుండి అన్నదాత సుఖీభవ వేడుకలు నిర్వహించాలని నేతలను సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాలతో జగన్‌కు ఫ్రస్టేషన్ పెరిగిందని విమర్శించారు. హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్‌తో కలిసి జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరంపై కేసులు వేసినవాళ్లతో వైసీపీ లాలూచీపడిందన్నారు. మూడు పార్టీల కుట్రలు నెరవేరితే రాష్ట్రానికి నీళ్లు రావని సీఎం చంద్రబాబు అన్నారు.