Thursday, August 22, 2019
Follow Us on :

చంద్రబాబు నివాసం వద్ద ఏమి జరుగుతోంది..!

By BhaaratToday | Published On May 23rd, 2019

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఫ్యాన్ గాలి దెబ్బకు సైకిల్ ఎక్కడికిపోయిందో తెలీడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగుదేశం బడా నాయకులంతా ఫ్యాన్ హవా ముందు నిలబడలేకపోయారు. ఇక గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉండటంతో ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో, వైసీపీ కార్యకర్తలను అక్కడి సెక్యూరిటీ అడ్డుకుంది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. వైస్సార్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి  రెడప్పగారి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శితో పాటు ప్రాధమిక సభ్యత్వానికి తిరుపతికి చెందిన నీలం బాలాజీ రాజీనామా చేశారు.