Friday, July 19, 2019
Follow Us on :

జగన్ వద్దకు సినీ నటులు క్యూ కట్టడానికి కారణమిదేనన్న చంద్రబాబు

By BhaaratToday | Published On Apr 2nd, 2019

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వీరి చేరికలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బెదిరింపుల కారణంగానే వారంతా వైసీపీలో చేరుతున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీలో చేరకుంటే వారి ఆస్తులను ఆక్రమిస్తామని బెదిరిస్తున్నారని, హైదరాబాద్‌ నగరంలోని తమ తమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే నటీనటులు అయిష్టంగా వైకాపా కండువాలు కప్పుకుంటున్నారని అన్నారు. అద్దె మనుషులు, వలస పక్షులు కోడికత్తి పార్టీకి మద్దతుగా ప్రచారానికి వస్తున్నారని, వీరంతా ఎలక్షన్స్ ముగియగానే హైదరాబాద్ కు వెళ్ళిపోతారని చంద్రబాబు విమర్శించారు. 

అన్ని ప్రాంతాల్లో టీడీపీపై సానుకూలత కనిపిస్తోందని, వైసీపీపై ఎంతో వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ వేసిన నిందలతో రాష్ట్ర ప్రజల్లో రోషం పెరగాలని, మరింత పట్టుదలతో టీడీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.