Monday, September 23, 2019
Follow Us on :

చంద్రబాబు-ఇమ్రాన్ ఖాన్ ఒకటే అన్న విజయ్ సాయి రెడ్డి..!

By BhaaratToday | Published On Sep 3rd, 2019

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని భారత్ మీద చేస్తున్న ప్రేలాపనలు అంతా ఇంతా కాదు. ప్రపంచదేశాల ముందు భారత్ ను దోషిగా చూపాలని పాకిస్థాన్ చేసిన ఏ ఒక్క ప్రయోగం కూడా ఫలించలేదు. దీంతో ఆ దేశ ప్రధాని భారత్ మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే అగ్రరాజ్యాలేవీ ఇమ్రాన్ ఖాన్ మాటలను పట్టించుకోవడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పాకిస్థాన్ తన వాయిస్ ను మార్చింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ "గుర్తుంచుకోండి, ఈ వివాదం యుద్ధానికి దారి తీస్తే మాత్రం ఆ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. రెండు దేశాలు అణ్వాయుధ సహిత దేశాలే. అణుయుద్ధంలో విజేత అంటూ ఎవరూ ఉండరు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ అగ్రరాజ్యాలపై పెను బాధ్యత ఉంది"  అంటూ వ్యాఖ్యలు చేశాడు. అక్కడితో ఆగని ఇమ్రాన్ ఖాన్ అగ్రరాజ్యాలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, పాకిస్థాన్ ఎంత దూరమైనా వెళుతుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.  

అయితే ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలను, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాటలను లింక్ చేస్తూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చికొడితే ఎక్కడో పడిన చంద్రబాబు హెచ్చరికలు ఒకేలా ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. కేవలం 3 నెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని చంద్రబాబు చెబుతున్నారని.. అర్జంటుగా కుర్చీని ఖాళీ చేయాలని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని అన్నారు.