Tuesday, June 18, 2019
Follow Us on :

కుప్పంకు వెళుతున్న చంద్రబాబు నాయుడు

By BhaaratToday | Published On May 21st, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం కు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ఎన్డీయేతర పక్షాల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, ఆ తర్వాత తమ కూటమి నేతలతో కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు. ఎన్డీయేతర పక్షాల నేతలతో సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు బెంగళూరు బయలుదేరారు. రేపు(మే 22) ఉదయం తొమ్మిది గంటలకు బెంగళూరు నుంచి కుప్పంకు చంద్రబాబు వెళ్లనున్నారు. కుప్పంలోని గంగమ్మ జాతరలో పాల్గొంటారు. చంద్రబాబు దంపతులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆ తర్వాత చంద్రబాబు విజయవాడ బయలుదేరి వెళతారని సమాచారం.

Image may contain: one or more people and crowd

Image may contain: 4 people, people smiling

No photo description available.

Image result for కుప్పం