Monday, September 23, 2019
Follow Us on :

ఎవరండీ ఈ 'బాబు'..!

By BhaaratToday | Published On Sep 6th, 2019

ఇటీవలి కాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉంటాయో ఏమో తెలీదు కానీ.. ఆయన తీసే సినిమాలలో ఫేమస్ సెలెబ్రిటీలకు సంబంధించి అచ్చుగుద్దినట్లు ఉండే వాళ్ళు చాలా మందినే మనకు పరిచయం చేశాడు. ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే వివాదాస్పద చిత్రంతో ఇంకెన్ని గొడవలు సృష్టిస్తాడో..! ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో రామ్ గోపాల్ వర్మ పోస్టు చేశాడు. అచ్చుగుద్దినట్టుగా చంద్రబాబు పాత్రలో ఉన్న వ్యక్తి ఫొటోను షేర్ చేశారు. ఈ పాత్ర ఎవరిదో గెస్ చేయండి.. ఆ పాత్రలో ఓ కొత్త నటుడు నటిస్తున్నాడు అంటూ ఫొటోను షేర్ చేశారు. ఈ సినిమా ద్వారా ఇంకా ఎన్ని వివాదాలు సృష్టిస్తాడో చూడాలి.