Sunday, August 18, 2019
Follow Us on :

కుప్పంలో వెనుకబడ్డ చంద్రన్న..  మంత్రుల పరిస్థితి ఇది

By BhaaratToday | Published On May 23rd, 2019

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ముందంజలో దూసుకెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఆధిక్యంలో ఉండగా.. తొలి రౌండ్‌లో కూడా వైసీపీనే ముందంజలో ఉంది. 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. మొదటి, రెండో రౌండ్‌లోనూ ఆయన వెనుకబడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళి ముందజలో కొనసాగుతున్నారు.

టెక్కలిలో తొలి రౌండ్‌లో మంత్రి అచ్చెన్నాయుడు వెనుకంజలో ఉన్నారు. అలాగే నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ వెనుకంజలో ఉన్నారు. నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీ ముందంజలో ఉంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి 2435 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. అలాగే నెల్లూరు సిటీలో కూడా వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అంతేకాకుండా నెల్లూరు రూరల్‌లో కూడా వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 3 వేల ఓట్లతో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.