Thursday, April 25, 2019
Follow Us on :

ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు.. ఈ అంశాలు తెరపై

By BhaaratToday | Published On Apr 15th, 2019

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అనుమానాలను వెళ్ళగక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము చేసిన పిర్యాదుపై సీఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై తమకు అనుమానాలున్నాయన్నారు. 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఓట్ల దొంగలపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉదయం పని చేయడం మానేసిన ఈవీఎంలను మధ్యాహ్నానికి కానీ రెడీ చేయలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాను అడిగిన వాటిపై ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని చంద్రబాబు అన్నారు.