Tuesday, June 18, 2019
Follow Us on :

చంద్రబాబు సెటైర్లు.. జగన్ కూడా నవ్వేశారు

By BhaaratToday | Published On Jun 13th, 2019

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు కాస్త నవ్వులు పూశాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పీకర్ గా ఎన్నికయిన తమ్మినేని సీతారాంకు శుభాకాంక్షలు చెప్పారు. 

అయితే చంద్రబాబు మాట్లాడుతుండగా, పలుమార్లు మైక్ కట్ అయింది. దీంతో సభలో గోలగోల మొదలయింది. అప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ..‘మైకులు పనిచేయకపోయినా మాటలు వస్తాయి. నాకు మాట్లాడటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సుదీర్ఘ అనుభవం ఉంది నాకు. మీ అందరి కంటే ఎక్కువ అనుభవం ఉంది. అన్నీచూశాను నేను రాజకీయాల్లో. కాబట్టి మాటలు ఆటోమేటిక్ గా వస్తాయి అన్నారు. మీ ఆధ్వర్యంలో ఈ మైక్ పనిచేస్తోంది. మేమున్నప్పుడు బాగానే పనిచేసింది. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో పనిచేయడం లేదు కాబట్టి మీరే ఆలోచించుకోవాలి’ అని అన్నారు. సీఎం జగన్ తో పాటు సభలో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. సభలో తన వాయిస్ తగ్గదనీ, తన పోరాటం కూడా తగ్గదని చంద్రబాబు అన్నారు.