Wednesday, October 16, 2019
Follow Us on :

రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండ‌కూడ‌దు: చ‌ంద్ర‌బాబు

By BhaaratToday | Published On Feb 27th, 2019

ఏపీ రాష్ట్రంలో రౌడీ అనే వాడు ఉండడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు.. టీడీపీ అధికారంలో ఉంటేనే శాంతిభద్రతలు. ఆ పదేళ్లలో 200 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గుర‌య్యార‌ని, అప్పట్లో రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా మార్చార‌ని ఆరోపించారు. మళ్లీ ఆ పరిస్థితులు రానివ్వకూడదని వైసీపీ రౌడీయిజంపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్రబాబు పిలుపిచ్చారు. పార్టీ నాయ‌కుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌మించిన ఆయ‌న‌, ప‌లు సూచ‌న‌లు చేశారు. వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, నిరాశా నిస్పృహలతో అరాచకాలు సృష్టిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.‘నేరాలతో సంపాదించిన డబ్బుతో వైసీపీ రౌడీయిజం చేస్తోంది. చంద్రగిరిలో రౌడీయిజంపై జనమే తిరగబడతారు. వైసీపీ వస్తే గల్లీగల్లీకి రౌడీలు తయారవుతారు. మహిళలు, చిన్నారులకు భద్రత ఉండదు. వ్యాపారులను వ్యాపారం చేసుకోనివ్వరు. 13 జిల్లాల్లో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.