Friday, July 19, 2019
Follow Us on :

అర్ధరాత్రి రెచ్చిపోవడం.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు

By BhaaratToday | Published On Mar 31st, 2019

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పినపాకం హరిజనవాడలో ఇరువర్గాల మధ్య మొదలైన చిన్పపాటి గొడవ క్రమంగా ముదిరి కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం ఎన్నికలు ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.