Tuesday, October 15, 2019
Follow Us on :

ఎవరు చెప్పారు.. చంద్రయాన్-2 పూర్తిగా విఫలం అయిందని..!

By BhaaratToday | Published On Sep 7th, 2019

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి దశలో విఫలమవ్వడంతో ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోదీ దగ్గరకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. శివన్ ను మోదీ దగ్గరకు తీసుకుని, గాఢంగా హత్తుకున్నారు. తన భుజంపై శివన్ తల ఉంచుకుని, ఆయన వీపును నిమురుతూ, ధైర్యం చెప్పారు. అయితే చంద్రయాన్-2  పూర్తిగా విఫలం అయినట్టు భావించకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్-2 ప్రయోగం 95 శాతం సక్సెస్ అయినట్టేనని ఇస్రో సీనియర్ అధికారి చెప్పారు.

విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు రావడం ఆగిపోయినంత మాత్రాన చంద్రయాన్-2 పూర్తిగా విఫలం అయినట్టు కాదట..! ఈ మొత్తం ప్రయోగంలో 5 శాతం మాత్రమే విఫలమైనట్టు భావించాలని, చంద్రుడి చుట్టూ నిర్దేశిత కక్ష్యలో ఆర్బిటర్ పరిభ్రమిస్తూనే ఉందని అంటున్నారు ఇస్రో అధికారులు. ఎందుకంటే ఆర్బిటర్ ఎంతో విలువైన సమాచారం సేకరించి భూమికి పంపిస్తుంది. సంవత్సరం పాటు ఆర్బిటర్ నుంచి చంద్రుడికి చెందిన ఫొటోలు, ఇతర డేటా అందిస్తూ ఉంటుంది.