Saturday, October 19, 2019
Follow Us on :

బ్రేకింగ్: విక్రమ్ ల్యాండర్ సేఫ్ గానే ఉందన్న ఇస్రో అధికారులు

By BhaaratToday | Published On Sep 9th, 2019

చంద్రయాన్-2 ల్యాండింగ్ లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ ఆగిపోయింది. చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు ల్యాండర్ నుంచి ఆర్బిటర్, గ్రౌండ్ స్టేషన్స్ కు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడిపై స్థిరమైన కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ తో ల్యాండర్ జాడను ఇస్రో కనిపెట్టింది. హార్డ్-ల్యాండింగ్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ సేఫ్ గానే ఉందని ఇస్రో సీనియర్ అధికారులు తాజాగా వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్ ఇంకా ఒకే పీస్ లాగా ఉందని.. పెద్దగా డ్యామేజీ జరిగినట్లు తాము భావించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ సేఫ్ ల్యాండింగ్ జరిగి ఉండి.. ఎక్విప్మెంట్ మొత్తం సరిగా పనిచేస్తూ ఉండి ఉన్నట్లయితే కమ్యూనికేషన్ జరగడం ఈజీగా సాధ్యమయ్యేదని.. సేఫ్ ల్యాండింగ్ జరగలేదు కాబట్టి విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ అన్నది చాలా కష్టమైన పనే అని అంటున్నారు. అయితే విక్రమ్ ల్యాండర్ విరిగిపోవడం లాంటివి జరగకపోవడంతో ఇంకా కమ్యూనికేషన్ వీలయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.   


చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఆర్బిటర్ గుర్తించిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఉన్న ప్రదేశాన్ని తాము గుర్తించామని, ఇందుకు సంబంధించిన థర్మల్ ఇమేజ్ ను ఆర్బిటర్ తీసి పంపిందని చెప్పారు. ల్యాండర్ నుంచి ఆర్బిటర్ కు గానీ, గ్రౌండ్ స్టేషన్స్ కు గానీ కమ్యూనికేషన్ రాలేదని తెలిపారు. ల్యాండర్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే కమ్యూనికేట్ అవుతామని శివన్ అన్నారు.