Thursday, April 25, 2019
Follow Us on :

దూసుకుపోతున్న సూపర్ కింగ్స్.. నైట్‌ రైడర్స్‌ పై ఘనవిజయం!

By BhaaratToday | Published On Apr 14th, 2019

ఐపీఎల్ 2019లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన చెన్నై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. నైట్‌ రైడర్స్‌ ఓపెనర్ క్రిస్ లిన్ 82(51 బంతుల్లో 7x4,6x6) రాణించాడు. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. షేన్‌ వాట్సన్‌(6), ఫాప్ డుప్లెసిస్‌(24), ధోనీ(16), కేదార్‌ జాధవ్‌(20) తక్కువ పరుగులకే ఔటైనా సురేశ్‌రైనా(57, 41బంతుల్లో 7x4,1x6) చెలరేగాడు. అతడికి చివర్లో రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్‌తో సహకరించాడు. దీంతో రెండు బంతులు మిగులుండగానే విజయం సాధించారు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఏడో విజయంతో లీగ్ లో మొదటిస్థానంలో ఉంది.