Saturday, October 19, 2019
Follow Us on :

చిదంబరం.. ఇంకొన్ని రోజులు

By BhaaratToday | Published On Aug 30th, 2019

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ కస్టడీని సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. గత 9 రోజులుగా సీబీఐ కస్టడీలోనే ఉన్న చిదంబరంకు మరో 4 రోజులు కస్టడీ పొడిగించారు. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆయనకు ఊరట లభించింది. ఇక ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం సెప్టెంబరు 5న నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 

చిదంబరంకు కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.