Wednesday, October 16, 2019
Follow Us on :

చైనా ఇలా వెన్నుపోటు పొడుస్తుందని పాక్ అసలు ఊహించలేదేమో..!

By BhaaratToday | Published On Aug 10th, 2019

ఇన్నాళ్లూ చైనా-పాకిస్థాన్ లు ఎంతగా కలిసి పనులు చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో చైనా తమకు సహాయం చేస్తుందేమోనని పాక్ భావించింది. కానీ అది కూడా జరగలేదు. భారత్ నిర్ణయంపై జోక్యం చేసుకోవాల్సిందిగా పాకిస్థాన్ కోరగా, అది తమ పని కాదని చైనా క్లియర్ గా చెప్పేసి సైడ్ అయిపోయింది.  సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మాత్రమే తాము సూచించగలమని, దక్షిణాసియాలో సామరస్యపూర్వక ధోరణితో వ్యవహరించాలన్నంత వరకే తాము చెప్పగలమని చైనా తేల్చి చెప్పింది.  భారత్ కు వ్యతిరేకంగా తమతో కలిసొస్తుందని భావించిన పాకిస్థాన్ కు చైనా ఇలా సమాధానం ఇవ్వడంతో షాకైంది.   

అనుకూలంగా స్పందించాలంటూ చైనాకు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.. అయినా కూడా చైనా తామేమీ చేయలేమని చెప్పుకొచ్చింది. బీజింగ్ వెళ్లి చైనా విదేశాంగ మంత్రితో భేటీ అయినా ఏమీ సాధించలేకపోయారు. ఇప్పటికే పలు దేశాలు కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోమని స్పష్టం చేశాయి.. ఐక్యరాజ్యసమితి కూడా దీనిపై ఎటువంటి మాట మాట్లాడలేదు. కనీసం చైనా అన్నా తమకు మద్దతుగా మాట్లాడుతుందని పాక్ ఆశించింది. కానీ అది కూడా జరగలేదు.