Sunday, August 18, 2019
Follow Us on :

చింతమనేనికి భారీ షాక్ ఇచ్చిన ప్రజలు

By BhaaratToday | Published On May 23rd, 2019

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఎన్నో వివాదాలు ఆయన చుట్టూ తిరిగాయి. పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్ గా చింతమనేనిని పలుమార్లు తన మాటలతూటాలతో అటాక్ చేశారు. అయితే ప్రజలు కూడా భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి గట్టి షాక్‌ ఇచ్చారు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి  విజయం సాధించారు. ఎంపీపీగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసారి మాత్రం ప్రజలు చింతమనేనికి అవకాశం అసలు ఇవ్వలేదు.  ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.