Monday, November 18, 2019
Follow Us on :

ఇది నిజంగా మెగా అభిమానులకు సూపర్ న్యూసే..!

By BhaaratToday | Published On Apr 16th, 2019

మెగా స్టార్ చిరంజీవి రాజకీయాల నుండి తప్పుకున్నాక ఖైదీ నెంబర్ 150 సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు 'సైరా' తో ఏకంగా విందు భోజనాన్నే అందించడానికి రెడీ అయ్యారు. త్వరలో కొరటాల శివ, త్రివిక్రమ్ లతో సినిమాలు చేస్తారని చెబుతున్నారు. ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్ ను మెగా స్టార్ చిరంజీవి మొదలుపెట్టనున్నారు. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయబోతున్నారట చిరు. 

తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఒక సినిమా కోసం కథను సిద్ధం చేయడానికి అల్లు అరవింద్ శంకర్ ని ఒప్పించారట.తెలుగులో చిరంజీవి కథానాయకుడైతే, తమిళంలో అజిత్ లేదా విజయ్ తో గాని ఈ ప్రాజెక్టు చేసేలా మాటలు జరిగాయని ఫిలింనగర్ వర్గాల భోగట్టా..! చిరంజీవి కి ఉన్న ఫాలోయింగ్ కు శంకర్ స్టార్ తోడయితే ఈ ప్రాజెక్ట్ ఎంత భారీగా ఉంటుందో ఊహలకే అందడం లేదు. ఇది మెగా అభిమానులకు సూపర్ న్యూసే.. ఇది ఎంత తొందరగా నిజమైతే అభిమానులకు అంత ఆనందం.