Monday, November 18, 2019
Follow Us on :

తన మీద వస్తున్న వదంతులపై స్పందించిన యాంకర్ ప్రదీప్.. ఆ కారణంతోనే దూరం..!

By BhaaratToday | Published On Nov 8th, 2019

ఎవరైనా యాక్టర్లు కానీ.. యాంకర్లు కానీ.. సెలెబ్రిటీలు కానీ.. కొద్దిరోజులు బయట కనిపించకపోతే చాలు..! వాళ్లకు ఏదో అయ్యిందంటూ రకరకాల పుకార్లు షికారు చేస్తాయి. గత కొద్దిరోజులుగా బుల్లితెర యాంకర్ ప్రదీప్ కూడా కనిపించలేదు. ఇంతలో ఏమైందంటూ అతడి అభిమానులు కంగారు పడడం మొదలుపెట్టారు. ఇలాంటి దశలో ప్రదీప్ తన మీద వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టాడు. 

తాను క్షేమంగా ఉన్నానని.. తనకు ఏమైందో అంటూ బాధపడ్డ వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. కాలికి షూట్ సమయంలో చిన్న ప్రాశ్చర్ అయినా కూడా షూట్స్ లో పాల్గొన్నాడు ప్రదీప్. అయితే ఎక్కువ సమయం నిల్చుని ఉండటం వల్ల ఆ గాయం మానదని డాక్టర్లు చెప్పడంతో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ప్రదీప్ తెలిపాడు. గత నాలుగు అయిదు వారాలుగా కాళ్ళను అలా పైకి పెట్టి టీవీ చూస్తూ కూర్చున్నాననీ.. మరో ఒకటి రెండు వారాల్లో షూట్ లో జాయిన్ అవ్వబోతున్నానన్నాడు. షూటింగ్స్ ను చాలా మిస్ అవ్వడం.. ఇబ్బందిగానే అనిపించినా తప్పలేదన్నాడు ప్రదీప్. మీరు తొందరగా కోలుకోవాలి అంటూ ప్రదీప్ అభిమానులు కామెంట్లు చేశారు.