Saturday, October 19, 2019
Follow Us on :

రాబోయే ఎన్నిక‌ల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ల‌గ‌డ‌పాటి

By BhaaratToday | Published On Feb 22nd, 2019

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ జడ్పీటీసీ, టీడీపీ మహిళా నేత దగ్గుమల్లి భారతిని ప‌రామ‌ర్శించారు. అనంత‌రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు లగ‌డ‌పాటి స‌మాధాన‌మిచ్చారు. ఈ క్రమంలో మీరు ఏలూరు నుంచి పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని లగడపాటిని కొందరు ఆసక్తిగా అడిగారు. అలాంటిది ఏమి లేదని నవ్వుతూ సమాధానం చెప్పారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు.