Friday, March 22, 2019
Follow Us on :

ఆ వేలిముద్రలు.. పాద ముద్రలు ఎవరివి..?

By BhaaratToday | Published On Mar 15th, 2019

వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కలకలం రేపుతోంది. క్లూస్ టీమ్ ఆయన గదిలో కొన్ని వేలిముద్రలు, పాదముద్రలు సేకరించినట్టు  ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ తెలిపారు..నిన్న రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఏం జరిగిందో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇం‍ట్లో ఉన్న పనిమనుషులను అందరినీ విచారణ చేస్తున్నాం. ఘటనా స్థలంలో వేలిముద్రలు దొరికాయని, మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నామని రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు. తాము సంఘటన స్థలాన్ని పరిశీలించిన సమయంలో ఇంటి వెనుక తలుపు తెరిచే ఉందని అన్నారు. వెనుక తలుపు నుంచి ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఘటన రాత్రి 11.30 ప్రాంతంలో జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ఇంటికి ఎవరెవరు వచ్చారన్న దానిపై ఆరాతీస్తున్నామని చెప్పారు.