Thursday, December 12, 2019
Follow Us on :

భట్టి వ్యాఖ్య‌ల‌కు సీఎం కౌంట‌ర్.. నిబంధనల ప్రకారమే..

By BhaaratToday | Published On Jul 18th, 2019

12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిక‌పై, కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షం టీఆర్ఎస్‌లో విలీనంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో కలుపుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు. అయితే భట్టి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగానే విలీనం జరిగిందని అన్నారు. నిబంధనల ప్రకారమే టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనం జరిగిందని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో కొన్ని నిబంధలు ఉన్నాయని, ఆ నిబంధనలకు సంబంధించే వ్యవహారాలు జరుగుతాయని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షెడ్యూల్ 10 నిబంధనల ప్రకారం టీఆర్ఎస్‌లో చేరారని చెప్పారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీలో చేరతామని వచ్చారని.. తాము చేర్చుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తమకు కావలసిన మెజారిటీ ఉందని చెప్పామన్నారు.