Monday, December 09, 2019
Follow Us on :

తప్పు చేస్తే ఎవరైనా ఒకటే.. మంత్రైనా హెచ్చరికలే..!

By BhaaratToday | Published On Nov 16th, 2019

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టాక ఆ రాష్ట్ర పరిస్థితులు ఒక్కొక్కటిగా మారిపోయాయి. క్రిమినల్స్ అందరినీ జైళ్లకు పరిమితం చేశారు. ఇక నేతలు ఎవరైనా ఎలా పడితే అలా మాట్లాడితే వాళ్లకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఆయన ఓ మంత్రిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్వాతిసింగ్‌ ఓ పోలీస్‌ అధికారిపై ఆమె ఫోన్‌లో బెదిరిస్తున్న ఆడియో రికార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్వాతిసింగ్‌పై  రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆమె పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ ఆమెకు నోటీసులు పంపారు. ఫోన్‌కాల్‌ రికార్డుపై 24 గంటల్లో సీఎం కార్యాలయానికి, డీజీపీకి వివరణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.